గుజరాత్‌ లయన్స్‌ నాయకుడు రైనా

     ఐపీఎల్‌లోకి కొత్తగా అడుగుపెట్టబోతున్న రెండు జట్లలో రెండోదాని నామకరణం కూడా పూర్తయింది. రాజ్‌కోట్‌ కేంద్రంగా రాబోతున్న కొత్త జట్టుకి ‘గుజరాత్‌ లయన్స్‌’ అని పేరు పెట్టుకుంది యాజమాన్య ఇంటెక్స్‌ గ్రూప్‌. ఆ మధ్య డ్రాఫ్ట్‌లో రూ.12.5 కోట్లు పెట్టి కొనుక్కున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ మాజీ ఆటగాడు సురేశ్‌ రైనాకు జట్టు పగ్గాలు అప్పగించింది యాజమాన్యం.      పుణె కేంద్రంగా ఐపీఎల్‌లోకి కొత్తగా వస్తున్న మరో ఫ్రాంఛైజీకి ‘రైజింగ్‌ పుణె సూపర్‌జైంట్స్‌’గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.



ధోనితో తలపడితే భలే మజా
ధోని లాంటి గొప్ప కెప్టెన్‌తో తలపడితే భలే మజా ఉంటుంది అంటున్నాడు సురేశ్‌ రైనా. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ధోని, రైనా కలిసే చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతూ వచ్చారు. కానీ ఈ ఏడాది వీళ్లిద్దరూ ప్రత్యర్థులుగా మారుతున్నారు. ధోని పుణె జట్టుకు నాయకత్వం వహిస్తుంటే.. రైనా గుజరాత్‌ జట్టును నడిపించబోతున్నాడు. ‘‘చెన్నై జట్టులో అత్యంత గొప్ప కెప్టెన్‌ నాయకత్వంలో ఆడి.. మెరుగైన ఆటగాడిగా బయటికి వచ్చాను. ఐపీఎల్‌లో మేమిద్దరం ప్రత్యర్థులుగా తలపడబోతుండటం గురించి ఆస్ట్రేలియాలో మాట్లాడుకున్నాం. ఐతే అందులో చాలా మజా ఉంటుంది. ధోని వికెట్‌ తీసి జడేజా సంబరాలు చేసుకుంటుంటే ఎలా ఉంటుందో వూహించుకోండి. ధోని, నేను కలిసి కొన్ని ఫైనళ్లను ముగించాం. అలాంటిది ఇప్పుడు ధోని హెలికాఫ్టర్‌ షాట్‌ను అడ్డుకోవడానికి నేను ప్రణాళికలు రచించుకోవాలి’’ అని రైనా అన్నాడు. గుజరాత్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికవడం గురించి స్పందిస్తూ.. ‘‘ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మా జట్టులో ఇప్పటికే గొప్ప ప్రతిభావంతులున్నారు. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నా. మా ఆరంభం అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా’’ అని రైనా చెప్పాడు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి టీ20 సిరీస్‌ గెలవడం టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ అవకాశాల్ని మరింత పెంచిందని రైనా అభిప్రాయపడ్డాడు.
Share on Google Plus

About New Google World

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment