గ్రూప్ 2, పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు రెండునెలల పాటు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం TSPSC ని కోరింది. గ్రూప్ పోస్టులను పెంచిన తర్వాత పరీక్షలు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ఏ ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉందో నోటిఫై చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పోస్టులు పెంచాలని కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్షాలు సీఎం కేసీఆర్ ను కలిసి పోస్టులు పెంచే విషయమై ఆలోచించాలని కోరాయి.
గ్రామీణ ప్రాంత అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా జరిగే పోటీ పరీక్షలు జరిగే తేదీల్లో రాష్ట్రంలో ఎటువంటి పోటీ పరీక్షలు నిర్వహించబోమని ప్రకటించింది. ఎస్సై పరీక్షలో ఇంగ్లీషు వెయిటేజీని రద్దు చేసినట్లు తెలిపింది. పోటీ పరీక్షలను వాయిదా వేసినా.. ఉద్యోగాల సంఖ్యను పెంచుతున్నామని, ఇది అభ్యర్థులకు మేలు జరిగే అంశమని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు అభ్యర్థులు చదువుకోవడానికి సమయం కూడా ఉంటుందని చెబుతున్నారు.
0 comments:
Post a Comment