కోహ్లీ- అనుష్క


   ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రేమ జంట విరాట్‌ కోహ్లీ, అనుష్క విడిపోయినట్టు నెట్‌లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క అకౌంట్‌ను ఫాలో అయ్యే కోహ్లీ.. ఇటీవలి కాలంలో పట్టించుకోకపోవడమే అందుకు సాక్ష్యమంటున్నాయి. కోహ్లీ పెళ్లి ప్రతిపాదనను అనుష్క తిరస్కరించడం వల్లే వారి మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. సినిమా కెరీర్‌పైనే తన పూర్తి ఫోకస్‌ అని.. 2017 వరకు పెళ్లి ప్రస్తావనే లేదని అనుష్క తెగేసి చెప్పినట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతే కాకుండా కుటుంబ సంప్రదాయం ప్రకారం పెళ్లి కోసం గడ్డం పెంచిన విరాట్‌.. ఇప్పుడు తీసేయడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గత ఏడాది కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్టు ఉహాగానాలు బలంగా వినిపించాయి. కానీ వీటిని అనుష్క కొట్టిపారేసింది.
Share on Google Plus

About New Google World

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment